: పోరాటం మరింత ఉద్ధృతం.. సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన హోంగార్డులు.. లాఠీఛార్జ్


తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయాలంటూ కొన్ని రోజులుగా నిరసనలు తెలుపుతున్న హోంగార్డులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో జరిపిన చర్చలు ఫలించలేదు. దీంతో మ‌రింత ఆగ్ర‌హించిన‌ హోంగార్డులు హైద‌రాబాద్‌లోని సచివాలయం ముట్టడికి యత్నించారు. ఇందిరాపార్కు వ‌ద్ద ఆందోళ‌న తెలుపుతున్న వారు అక్క‌డి నుంచి భారీ సంఖ్యలో ర్యాలీగా సచివాలయానికి వ‌చ్చి ఈ ప్ర‌య‌త్నం చేశారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారంతా గేటు వ‌ద్దే బైఠాయించి నినాదాలు చేశారు. పోలీసులు వారిని అక్క‌డి నుంచి పంపేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో పోలీసుల‌కి, హోంగార్డుల‌కి మ‌ధ్య వాగ్వివాదం చెల‌రేగింది. ఆందోళ‌న‌లో ప‌లువురు హోంగార్డుల‌కు గాయాల‌య్యాయి.

  • Loading...

More Telugu News