: ట్విట్టర్లో రానా ‘తెలుగు’ ట్వీటుకు ఆసక్తికర కామెంట్లు.. భలే సరదాగా ఉన్నాయ్!


ట్విట్టర్‌లో భారీగా ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకున్న యువ నటుడు రానా త‌న అనుభ‌వాల‌ను, అభిప్రాయాల‌ను అందులోనే పోస్టు చేస్తూ సోష‌ల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. ‘బాహుబలి’లో భళ్లాలదేవుడిగా అంద‌రినీ మెప్పించిన రానాకి ట్విట్ట‌ర్‌లో తాజాగా తెలుగులో ట్వీట్ చేయాల‌నిపించింది. అందుకే 'తెలుగులో ట్వీట్‌ చేసే మొదటి ప్రయత్నం' అని ట్విట్ట‌ర్ లో ముందుగానే పేర్కొన్నాడు. దేశ భాషలందు తెలుగు లెస్స అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై ఆయ‌న అభిమానులు భారీగా స్పందించారు. ఓ అభిమాని ‘హలో బ్రదర్‌..! ట్వీట్‌ అనే పదం కూడా తెలుగులో రాసుంటే బాగుండేది’ అని బదులిచ్చాడు. దానికి రానా రిప్లై కూడా ఇచ్చాడు. ‘ట్వీట్‌ అనేది English పదం కాబట్టి వదలేసాను’ అని పేర్కొన్నాడు. అనంత‌రం మ‌రో అభిమాని ట్వీట్ చేస్తూ ‘వ‌దిలేయ‌డానికి అది అవంతిక కాదు భళ్లాలదేవా.. అది దేవ‌సేన’ అంటూ పేర్కొన్నాడు. మ‌రో అభిమాని ట్వీట్ చేస్తూ ‘ఇంగ్లీష్ ప‌దం కాబ‌ట్టి వ‌దిలేశాను అని అనకూడ‌దు.. ఆంగ్ల ప‌దం కాబ‌ట్టి వ‌దిలేశాను అనాలి’ అని పేర్కొన్నాడు. మ‌రో అభిమాని ఏకంగా ట్వీట్‌లోకి డిక్ష‌న‌రీనే తీసుకొచ్చి ‘ట్వీట్ అంటే అర్థం ప‌క్షి అరుపు, ప‌క్షివ‌లే అర‌చు’ అంటూ డిక్ష‌న‌రీలో ఉన్న ప‌దాలను వివ‌రించి చెప్పాడు.

  • Loading...

More Telugu News