: పిల్లలపై క్లారిటీ ఇచ్చిన రాంచరణ్ భార్య ఉపాసన


సోషల్ మీడియాలో ప్రముఖ సినీ నటుడు ఉపాసన ఇంటర్వ్యూ హల్ చల్ చేస్తోంది. ఓ మేగజీన్ తో మాట్లాడిన ఉపాసన వివిధ విషయాలపై తన అభిప్రాయాలు వెల్లడించింది. చిన్నప్పటి నుంచి ఇంగ్లిష్ లో మాట్లాడడం వల్ల తనకు తెలుగు రాదని చెప్పింది. ప్రస్తుతం అపోలో పనుల్లో బిజీగా ఉన్నానని చెప్పింది. వివాహం సమయంలో సోషల్ మీడియాలో తన అందంపై తీవ్రమైన కామెంట్లు వచ్చాయని, అయితే వాటిని తాను తేలిగ్గా తీసుకున్నానని తెలిపింది. తన భర్తకు ఉన్న ఫ్యాన్స్ వారి ఊహలకు తగ్గ అమ్మాయిని ఊహించుకున్నారని, అందుకే తనపై విమర్శలు చేశారని చెప్పింది. ఈ మధ్యే బరువు తగ్గానని, ఇప్పుడే పిల్లలంటే మళ్లీ బరువు పెరిగిపోతానని ఆందోళన వ్యక్తం చేసిన ఉపాసన, తామిద్దరం సొంత ఇల్లు కట్టుకుంటున్నామని, అది పూర్తయిన తరువాత మరింత ఎక్కువ సమయం గడుపుతామని చెప్పింది. అప్పుడెలాగూ పిల్లలు పుడతారని తెలిపింది. డైవోర్స్ రూమర్స్ బాధించాయని తెలిపింది. అలాంటి ఆలోచన వస్తే తామిద్దరం ప్రకటన చేస్తామని చెప్పింది. చరణ్, తాను బెస్ట్ ఫ్రెండ్స్ అని, తమకు అలాంటి ఆలోచనలు లేవని, దయచేసి రూమర్స్ ఆపాలని సూచించింది.

  • Loading...

More Telugu News