: నాల్గో కాన్పులోనూ అమ్మాయే పుట్టిందని అమ్మేశారు!


నాల్గో కాన్పులోనూ ఆడపిల్లే పుట్టడంతో ఆ శిశువును పదివేల రూపాయలకు అమ్మేసిన సంఘటన నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో ఈరోజు జరిగింది. స్థానిక జంగాల కాలనీకి చెందిన కళ్లెం సైదులు, భాగ్యమ్మ దంపతులకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. పదిహేను రోజుల క్రితం మరో ఆడశిశువుకు భాగ్యమ్మ జన్మనిచ్చింది. దీంతో, ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలున్నారు, నాల్గో ఆడపిల్లను పోషించలేమని భావించిన ఆ దంపతులు, పాములపాడుకు చెందిన వారికి ఆ చిన్నారిని రూ.10 వేలకు విక్రయించారు. ఈ విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు విచారణ చేపడుతున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News