: సుప్రీం ఆదేశాల మేరకు 'ఓటుకు నోటు' కేసులో విచారణ పునఃప్రారంభం


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన 'ఓటుకు నోటు' కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసు విచారణను ఏసీబీ తిరిగి ప్రారంభించింది. గతంలో ఏసీబీ కోర్టు విచారణ కొనసాగించేందుకు ఆదేశించగా, హైకోర్టు స్టే ఇవ్వడంతో, ఆపై పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, నాలుగు వారాల్లో కేసును తేల్చాలని ఆదేశించిన వేళ, విచారణ తిరిగి ప్రారంభమైంది. ఈ కేసులో రేవంత్ రెడ్డితో పాటు చంద్రబాబు పేరును కూడా చేర్చాలంటూ వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడిక ఈ కేసులో చంద్రబాబు పేరు చేర్చాలా? వద్దా? అన్న విషయంలో సుప్రీంకోర్టు పెట్టిన నాలుగు వారాల గడువు ముగియనుండటంతో ఏసీబీ అధికారులు మరోసారి ఆడియో టేపులను, ఫోరెన్సిక్ రిపోర్టులను పరిశీలించనున్నారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News