: చంద్రబాబు! ఇప్పటికైనా చిత్తశుద్ధితో ప్రజా రాజధానిని నిర్మించండి: అంబటి రాంబాబు


స్విస్ ఛాలెంజ్ విధానం లోపభూయిష్టంగా ఉందంటూ హైకోర్టుకు వెళ్లిన వారిని ఉన్మాదులతో చంద్రబాబు పోల్చారని, మరి, కోర్టులో పిటిషన్ ను ఇప్పుడు ఎందుకు ఉపసంహరించుకున్నారంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. హైదరాబాద్ లోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్విస్ ఛాలెంజ్ విధానంపై రాష్ట్ర ప్రభుత్వం యు టర్న్ తీసుకుందన్నారు. అమరావతి నిర్మాణాలను సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టి, లక్షల కోట్లు సంపాదించాలనేదే చంద్రబాబు లక్ష్యమని ఆరోపించారు. ఆ లక్ష్యాన్ని న్యాయస్థానాలు అడ్డుకున్నాయని అన్నారు. అయితే, ఇప్పటికీ స్విస్ ఛాలెంజ్ పై వెనక్కి తగ్గేది లేదని మంత్రి నారాయణ అంటున్నారని, దీనిని బట్టి చూస్తుంటే, సింగపూర్ కంపెనీలతో కలిసి దోచుకోవడమే సర్కార్ లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. ఇప్పటికైనా, చిత్తశుద్ధితో ప్రజా రాజధానిని నిర్మించాలని అంబటి రాంబాబు అన్నారు.

  • Loading...

More Telugu News