: రెండేళ్లలో అమెరికా బలగాలు మా దేశం నుంచి వెళ్లిపోవాలి: పిలిప్పీన్స్‌ అధ్యక్షుడు


ఉగ్రవాదం అణచివేత కోసమంటూ పిలిప్పీన్స్ లో ఎంతో కాలం నుంచి అమెరికా మిలిటరీ బేస్‌ శిబిరాలను కొనసాగిస్తోంది. దీంతో అమెరికా బ‌ల‌గాలు అక్క‌డి నుంచి వెళ్లిపోవాలంటూ అక్క‌డి ప్ర‌జ‌లు పోరాడుతున్న సంగ‌తి తెలిసిందే. త‌మ దేశంలో అమెరికా బ‌ల‌గాల మోహ‌రింపు విష‌యంలో పిలిప్పీన్స్ అధ్య‌క్షుడు రోడ్రిగో డుటెర్టె ఇప్ప‌టికే ప‌లుసార్లు వివాదాస్పద వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఆయ‌న ఈ అంశంపై మ‌రోసారి స్పందించారు. రెండేళ్లలో తమ దేశం నుంచి అమెరికా బ‌ల‌గాలు వెనక్కు వెళ్లిపోవాలని రోడ్రిగో డుటెర్టె అన్నారు. ప్ర‌స్తుతం జ‌పాన్ రాజ‌ధాని టోక్యోలో ఆర్థిక సదస్సు జ‌రుగుతోంది. ఆ స‌ద‌స్సుకు హాజరైన ఆయన‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపైనే గతంలో అమెరికా అధ్య‌క్షుడు బరాక్ ఒబామాపై ఆయ‌న ప‌లు అభ్యంత‌ర‌క‌ర‌ వ్యాఖ్యలు చేసి, విమర్శలు కొనితెచ్చుకున్నారు. అనంత‌రం మళ్లీ త‌న వ్యాఖ్య‌ల‌ను వెనక్కు తీసుకున్నారు. తాజాగా అమెరికా సైన్యం వెళ్లిపోవాలని, అలాగే ఆ దేశంతో రక్షణ ఒప్పందాలను రద్దు చేసుకునే అంశాన్నీ తాము పరిశీలిస్తామని స‌ద‌స్సులో చెప్పారు.

  • Loading...

More Telugu News