: హాలీవుడ్ నటి ఏంజెలినాను ప్రశ్నించిన ఎఫ్ బీఐ
హాలీవుడ్ హీరోయిన్ ఏంజెలినా జోలిని అమెరికా దర్యాప్తు సంస్థ 'ఎఫ్ బీఐ' (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) అధికారులు ప్రశ్నించారు. తన భర్త బ్రాడ్ పిట్ విమానంలో జరిగిన గొడవ గురించి దాదాపు నాలుగు గంటల పాటు జోలీని అధికారులు విచారించారు. సెప్టెంబర్ 14న మద్యం మత్తులో ఉన్న బ్రాడ్ పిట్ తన కుమారుడు మాడ్ డాక్స్ (15)ను దుర్భాషలాడి, కొట్టాడని వార్తలు వెల్లువెత్తాయి. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే బ్రాడ్ పిట్ తో విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించింది జోలీ. విచారణ ముగిసిన తరువాత ఎఫ్ బీఐ వర్గాలు స్పందించాయి. తమ ప్రశ్నలకు జోలీ ఓపిగ్గా సమాధానాలు ఇచ్చిందని తెలిపాయి. విమానంలో గొడవ జరిగినందునే తాము కలగజేసుకోవాల్సి వచ్చిందని చెప్పాయి. మరికొన్ని వారాల పాటు విచారణ జరిగే అవకాశం ఉందని తెలిపాయి. అయితే, కోర్టు కేసులకు దూరంగా ఉండాలని జోలీ, బ్రాడ్ పిట్ ఇద్దరూ భావిస్తున్నారని చెప్పాయి.