: రాంచరణ్ ట్రూజట్ కు 'చిరు'కానుక ఇచ్చిన చంద్రబాబు


హీరో రాంచరణ్ బోర్డు డైరెక్టరుగా ఉన్న ట్రూ జెట్ సంస్థ బ్రాండ్ టర్బో మెఘా ఎయిర్ వేస్ సంస్థకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్)కింద చంద్రబాబు ప్రభుత్వం రూ. 4.90 కోట్లు మంజూరు చేసింది. విజయవాడ - కడప, విజయవాడ - తిరుపతి మధ్య వారంలో నాలుగు రోజుల పాటు ప్రయాణికులు ఉన్నా, లేకున్నా సర్వీసులు నిర్వహిస్తున్నందుకు జరిగే నష్టాన్ని భర్తీచేసేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 72 సీట్ల సామర్థ్యం ఉన్న ఏటీఆర్ - 72 విమానాలను ట్రూజెట్ నడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రతి సర్వీసులో 5 సీట్లను ఈ సంస్థ ప్రభుత్వానికి కేటాయిస్తోంది. ఇక ఏడాదిలో 672 సర్వీసులు నడిపినందుకు గాను ప్రభుత్వం రూ. 9.76 కోట్లను చెల్లించాల్సి వుండగా, తొలి ఆరు నెలలకు గాను నష్ట పరిహారంగా రూ. 4.90 కోట్లను చెల్లించింది.

  • Loading...

More Telugu News