: ధర్నాకు దిగిన బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, రామచంద్రారెడ్డిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తోన్న విధానాలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలు ఈ రోజు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో పాటు ఇతర నేతలు కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి కూడా ధర్నాకు దిగారు. తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ల హామీపై నిర్లక్ష్యం వహిస్తోందని వారు ఆరోపించారు. వాటి కోసం కేంద్రప్రభుత్వం నిధులిచ్చినా ఆ పనులు ముందుకు వెళ్లడం లేదని అన్నారు. విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని చెప్పిన టీఆర్ఎస్ నేతలు నగరాన్ని విషాద నగరంగా మార్చారని వారు విమర్శించారు.