: రాజీనామాల ద్వారా హోదా వస్తుందంటే మేం సిద్ధం: ఎంపీ మేకపాటి
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం పార్లమెంటును స్తంభింపజేస్తామని, రాజీనామా చేస్తామని ప్రకటించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై ఎంపీ, వైసీపీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పందించారు. రాజీనామాల ద్వారా హోదా వస్తుందంటే తాము అందుకు సిద్ధమేనని ప్రకటించారు. రాజీనామా చేస్తే ఎంతవరకు రాష్ట్రానికి ప్రయోజనమో ఆలోచిస్తామని చెప్పారు. ప్యాకేజీతో సంతృప్తిపడడం సరికాదని, ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం లేదని ఆయన వ్యాఖ్యానించారు. హోదాతో ఎన్నో పరిశ్రమలు ఏపీకి వస్తాయని ఆయన అన్నారు. జగన్ ఆదేశిస్తే రాజీనామా చేస్తామని చెప్పారు. అయితే, ఈ విషయంపై జగన్ తమతో ఇంతవరకు చర్చించలేదని చెప్పారు.