: అనంత వెంకట్రామిరెడ్డికి జగన్ పరామర్శ


వైసీపీ నేత, అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డిని ఆ పార్టీ అధినేత జగన్ పరామర్శించారు. వెంకట్రామిరెడ్డి తల్లి వెంకట సుబ్బమ్మ (80) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, అనంతపురంలోని సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల జగన్ సంతాపం ప్రకటించారు. వెంకట్రామిరెడ్డికి ఫోన్ చేసి పరామర్శించారు. తన తల్లి మరణంతో అనంత వెంకట్రామిరెడ్డి నివాసం వద్ద విషాదం అలముకుంది.

  • Loading...

More Telugu News