: ఆర్బీఐ హెచ్చరిక... నకిలీ నోట్లు పెరిగాయి... బాగా పరిశీలించాకే 500, 1000 నోట్లు తీసుకోండి!
ఇండియాలో నకిలీ కరెన్సీ నోట్ల చలామణి రోజురోజుకూ పెరుగుతున్నందున 500, 1000 రూపాయల నోట్లను తీసుకునేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వాటిని పరిశీలించి అసలైన నోట్లేనని తెలుసుకుని స్వీకరించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. "కొన్ని అసాంఘిక శక్తులు నకిలీ నోట్లను రోజువారీ లావాదేవీల్లోకి చొప్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. హయ్యర్ డినామినేషన్ లో నోట్లను సమాజంలోకి పంపుతున్నాయి. సెక్యూరిటీ ఫీచర్లను గమనించి నోట్లు అసలైనవో కాదో తెలుసుకోవడం చాలా సులభం. ప్రతి ఒక్కరూ తమ రోజువారీ లావాదేవీల్లో నోట్లను తప్పనిసరిగా పరిశీలించాలి" అని ఆర్బీఐ ఓ ప్రకటనలో సూచించింది. నోట్ల సెక్యూరిటీ ఫీచర్ వివరాలు ఆర్బీఐ అధికార వెబ్ సైట్ లో విపులంగా ఉన్నాయని, వాటిని గురించి చదివి తెలుసుకోవాలని పేర్కొంది. నకిలీ నోట్లను కలిగవున్నా, నకిలీవని తెలిసీ మార్పిడి చేయాలని చూసినా, అలా చేస్తున్న వారికి సహకరించినా, ఐపీసీ సెక్షన్ల ప్రకారం కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించింది.