: ఇప్పటికే 100 మిలియన్ డాలర్లు ఇచ్చా... ఇంకా ఇస్తా: డొనాల్డ్ ట్రంప్


ప్రైమరీ ఎన్నికల సమయంలో తాను ఎలాంటి విరాళాలు తీసుకోలేదని, తన సొంత డబ్బునే ఖర్చు పెట్టానని... అధ్యక్ష అభ్యర్థిగా ఖరారైన తర్వాతనే పార్టీ గెలుపు కోసం విరాళాలు తీసుకుంటున్నానని రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇప్పటి దాకా సొంతంగా 100 బిలియన్ డాలర్లను ప్రచారం కోసం వినియోగించానని, అవసరమైతే మరింత డబ్బును ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సీఎన్ఎన్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ మాత్రం సొంతంగా ఒక్క డాలర్ కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. ప్రైమరీ ఎన్నికల నాటి నుంచి కూడా ఆమె పూర్తిగా డొనేషన్లపైనే ఆధారపడ్డారని విమర్శించారు. హిల్లరీ అధికారంలోకి వస్తే తమకు లబ్ధి చేకూరుస్తారనే భావనతోనే పలువురు ఆమెకు విరాళాలు ఇస్తున్నారని ఆరోపించారు. బ్రెగ్జిట్ ను తాను ముందే ఊహించానని ట్రంప్ చెప్పారు. అదే విధంగా ఈ ఎన్నికల్లో గెలుపు కూడా తనదే అనే విషయం తనకు తెలుసని అన్నారు. హిల్లరీ అధికారంలోకి వస్తే అవినీతి పెరుగుతుందని... అది అమెరికన్లకు ఇష్టం లేదని చెప్పారు. ఒబామా తరహా పాలనను మరో నాలుగేళ్ల పాటు అనుభవించే ఓపిక అమెరికన్లకు లేదని తెలిపారు.

  • Loading...

More Telugu News