: వైరల్ గా మారిన అంతరిక్షం నుంచి భూమి వీడియో
అంతరిక్షంలోని స్పేస్ స్టేషన్ నుంచి మన అందమైన భూమి ఎలా ఉంటుందో చూపే ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమింగ్ వీడియోను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అందుబాటులోకి తెచ్చింది. ఇంటర్నేషనల్ శాటిలైట్ స్టేషన్ (ఐఎస్‌ఎస్) బయట తనకు అప్పగించిన పనిని ఓ వ్యోమగామి శ్రద్ధగా చేస్తుండగా అక్కడి నుంచి మన ధరిత్రి అందంగా కనిపిస్తున్న దృశ్యాలు ఈ స్ట్రీమింగ్ లో ఉన్నాయి. దీన్ని ‘వైరల్ యూఎస్‌ఏ’ ఫేస్ బుక్ పేజీలో పెట్టగా నెటిజన్ల నుంచి దీనికి అనూహ్య స్పందన వస్తోంది. ఈ వీడియోకు ఇప్పటి వరకూ 2 లక్షలకుపైగా షేర్లు, 4 లక్షలకుపైగా కామెంట్లు రావడం విశేషం.