: ఊహించని విధంగా అక్షర్ పటేల్ ను ముందుకు తెచ్చిన ధోనీ


కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ నాలుగో వన్డేలో ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. తొలుత ఫీల్డింగ్ సమయంలో అక్షర్ పటేల్ కు బంతిని ముందుగా ఇచ్చి తొలి వికెట్ రాబట్టిన ధోనీ, బ్యాటింగ్ లో కూడా అతనిపై నమ్మకముంచాడు. దీంతో ఈ సిరీస్ లో బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు వచ్చిన ధోనీ, ఈ సారి అక్షర్ పటేల్ ను కూడా ముందుకు తీసుకొచ్చాడు. నసీమ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా రహానే (57) వెనుదిరిగిన అనంతరం స్పెషలిస్టు బ్యాట్స్ మన్ మనీష్ పాండే, ఆల్ రౌండర్లు కేదార్ జాదవ్, హార్డిక్ పాండ్యా ఉండగానే అక్షర్ పటేల్ ను బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు తీసుకురావడం చర్చనీయాంశమైంది. ధోనీ నమ్మకాన్ని నిలబెడుతూ అక్షర్ పటేల్ జాగ్రత్తగా ఆడుతున్నాడు. ఈ క్రమంలో కెప్టెన్ ధోనీ (11)ని నసీమ్ 30వ ఓవర్ లో పెవిలియన్ కు పంపాడు. దీంతో టీమిండియా 140 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులో అక్షర్ పటేల్ (8), మనీష్ పాండే ఉన్నారు.

  • Loading...

More Telugu News