: మళ్లీ అక్షయ్ కుమార్ ఆదర్శంగా నిలిచాడు
ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన ప్రత్యేకతను మరోసారి నిలబెట్టుకున్నాడు. వ్యాపారాలు, కోట్లు కూడబెట్టడమే లక్ష్యంగా బాలీవుడ్ నటులంతా ముందుకు కదులుతుంటే...అక్షయ్ కుమార్ మాత్రం లాతూర్ రైతులకు సాయం చేశాడు. ఉరీ ఉగ్రదాడుల్లో హతులైన సైనికులకు, ఉత్తరభారతంలోని విద్యార్థినుల రక్షణకు వివిధ స్కూళ్లలో మార్షల్ ఆర్ట్స్ తన సంస్థ ద్వారా నేర్పిస్తూ ఇలా ఎన్నో సేవలు చేస్తున్నాడు. తాజాగా ఉగ్రదాడిలో హతమైన వీరజవాను గుర్నామ్ సింగ్ కుటుంబానికి సాయంగా 9 లక్షల రూపాయలు ప్రకటించాడు. దీంతో అక్షయ్ కుమార్ మరోసారి సినిమాల్లోనే కాదు, నిజజీవితంలో కూడా తాను హీరోనని నిరూపించుకున్నారు.