: కుట్రలు పన్నినా... చివరకు న్యాయమే గెలిచింది: యడ్యూరప్ప


ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అన్నారు. మైనింగ్ కేసులో ముడుపులు స్వీకరించారంటూ దాఖలైన కేసులో యెడ్డీకి సీబీఐ కోర్టు ఈరోజు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ సందర్భంగా కోర్టు తీర్పుపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు అప్పట్లో కుట్రలు పన్నారని... అయినా చివరకు న్యాయమే గెలిచిందని చెప్పారు. సత్యమేవ జయతే అంటూ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. కష్ట కాలంలో తనకు అండగా ఉన్న శ్రేయోభిలాషులకు, స్నేహితులకు, మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన ట్వీట్ చేశారు. తనకు మొదటి నుంచి దేవుడిపైన, న్యాయస్థానంపైన నమ్మకం ఉందని చెప్పారు. 2011లో సీఎంగా ఉన్నప్పుడు బళ్లారిలోని జిందాల్ స్టీల్ ప్లాంట్ కు మేలు చేసి, ప్రతిఫలంగా రూ. 40 కోట్ల ముడుపులు స్వీకరించారని అప్పట్లో యడ్యూరప్పపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, ఆ కేసును దాఖలు చేశారు.

  • Loading...

More Telugu News