: రాంచి వన్డే: బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్
భారత్లో న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ పర్యటనలో భాగంగా కొనసాగుతున్న ఐదు వన్డేల సిరీస్లో నాలుగో వన్డే ప్రారంభం అయింది. రాంచిలోని జేఎస్సీఏ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ ఓపెనర్లుగా గుప్తిల్, లాథమ్లు క్రీజులోకి వచ్చారు. సిరీస్లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. ఇప్పటికే టెస్టు సిరీస్ లో ఘనవిజయం సాధించిన టీమిండియా వన్డే సిరీస్ లోనూ గెలవాలనే కసితో ఉంది.