: వనస్థలిపురంలో దారుణం.. రసాయనాలు పడేసిన దుండగులు.. ఆసుపత్రి పాలయిన కాలనీవాసులు
హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఆ ప్రాంతంలోని ఖాళీ ప్రదేశంలో పలువురు గుర్తు తెలియని వ్యక్తులు రసాయనాలు పడేశారు. దీంతో అందులో నుంచి వస్తోన్న వాసనతో ఆ కాలనీవాసులు ఆసుపత్రి పాలయ్యారు. వాంతులు, తల నొప్పులతో సమీపంలోని ఆసుపత్రులకు క్యూ కట్టారు. చిన్నారుల తలలు ఉబ్బిపోయి కనిపిస్తున్నాయి. కొందరు కాలనీ వాసులు తమ బంధువుల ఇంటికి వెళ్లిపోతున్నారు. ఈ అంశంపై తాము అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.