: నియంత్రణ రేఖ వద్ద పాక్ కాల్పుల ఉల్లంఘన.. తిప్పికొట్టిన భారత్.. ఆరుగురు పాక్ జవాన్ల హతం


పాకిస్థాన్ మళ్లీ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. జమ్ముకశ్మీర్‌లోని ఆర్‌ఎస్‌పురా వద్ద భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా కాల్పులు జరిపింది. 15 బీఎస్ఎఫ్ పోస్టులను లక్ష్యంగా చేసుకుని యథేచ్ఛగా కాల్పులకు తెగబడింది. పాక్ రేంజర్ల కాల్పుల్లో 15 మంది భారత పౌరులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పాక్ దళాల కాల్పులను బీఎస్ఎఫ్ సమర్థంగా తిప్పికొట్టింది. బీఎస్ఎఫ్ కాల్పుల్లో 8 పాక్ రేంజర్ల పోస్టులు ధ్వంసమయ్యాయి. ఆరుగురు పాక్ రేంజర్లు హతమయ్యారు. ఉరీ ఉగ్రదాడి తర్వాత పాక్ కాల్పుల ఉల్లంఘన ఘటనలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. సరిహద్దులో రోజూ ఏదో ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేసుకుని కాల్పులు జరుపుతున్నాయి. పాక్ కాల్పులను బీఎస్ఎఫ్ సమర్థంగా తిప్పికొడుతూ బుద్ధి చెబుతోంది.

  • Loading...

More Telugu News