: ఎంఎన్ఎస్ ఆ విధంగా అడగటం తప్పు: వెంకయ్యనాయుడు


దర్శకుడు కరణ్ జొహార్ తాజా చిత్రం ‘ఏ దిల్ హై ముష్కిల్’లో పాక్ నటుడు ఫవాద్ ఖాన్ ఉన్న కారణంగా ఆ సినిమా విడుదలను అడ్డుకుంటామంటూ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) హెచ్చరించడం విదితమే. ఈ సినిమా విడుదల కావాలంటే భారత ఆర్మీ సహాయ నిధికి రూ.5 కోట్లు ఇవ్వాలంటూ ఆ చిత్ర దర్శకుడు కరణ్ జొహర్ ని ఎంఎన్ఎస్ డిమాండ్ చేయడంపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. న్యూఢిల్లీలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంఎన్ఎస్ ఈ విధంగా డిమాండ్ చేయడం తప్పని, ఇది చాలా తప్పుడు ప్రతిపాదన అని అన్నారు. ఈ ప్రతిపాదనతో తమ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని, ఆ ప్రతిపాదన చేసింది వేరే పార్టీ అని అన్నారు. కాగా, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సైతం ఈ ప్రతిపాదనతో తమకు సంబంధం లేదన్నారు.

  • Loading...

More Telugu News