: ప్రేమ పెళ్లి చేసుకోనున్న ముఖేష్ అంబానీ ముద్దుల కూతురు


రిలయన్స్ అధినేత, భారతదేశంలోనే అత్యంత సంపన్నుడు అయిన ముఖేష్ అంబానీ ముద్దుల కూతురు ఇషా అంబానీ పెళ్లిపీటలు ఎక్కనుంది. అయితే పెళ్లికుమారుడు ఎవరనే విషయం మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం, చాలా కాలంగా ఆమె ప్రేమలో ఉంది. ఏదేమైనప్పటికీ, తన కుమార్తె ఇష్టప్రకారమే ముఖేష్ అంబానీ వివాహం చేస్తున్నారు. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వెడ్డింగ్ కు పలువురు రాజకీయ ప్రముఖులు, బాలీవుడ్ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు హాజరుకానున్నారని సమాచారం. ఇంకో విషయం ఏమిటంటే... బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఈ వేడుకలో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నాడు.

  • Loading...

More Telugu News