: ధోనీ నాలుగో స్థానంలోనే బ్యాటింగ్‌కు వస్తే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి: గంగూలీ
భారత్, న్యూజిలాండ్ క్రికెట్ టీమ్‌ల మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా మొన్న జరిగిన మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కనబర్చిన బ్యాటింగ్ తీరుని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కొనియాడాడు. ఎక్కువ బంతుల్ని ఆడి న్యూజిలాండ్‌పై ఒత్తిడి తీసుకువచ్చి, ధోనీ సక్సెస్ అయ్యాడని అన్నారు. అయితే, తదుపరి మ్యాచుల్లోనూ నాలుగో స్థానంలోనే బ్యాటింగ్ కు దిగుతాడా? లేదా? అనే అంశం తనకు తెలియదని పేర్కొన్నాడు. ధోనీ నాలుగో స్థానంలోనే బ్యాటింగ్‌కు దిగితే భారత్ మంచి ఫలితాలు రాబట్టవచ్చని అన్నాడు. ధోనికి ఈ విషయాన్ని టీమిండియా చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే వివరిస్తారని తాను భావిస్తున్నట్లు గంగూలీ చెప్పాడు. నాలుగో స్థానంలో ధోని బ్యాటింగ్కు వస్తే అతనికి సౌకర్యవంతంగా ఉండడంతో పాటు, అభిమానులకీ బాగుంటుందని అన్నాడు. వన్డే, టీట్వంటీల్లో ధోని ఎంతకాలం ఆడతాడన్న విషయం తనకి తెలియదని పేర్కొన్నాడు. అయితే, బాగా రాణించడం అన్నది ధోనీకి అవసరమని వ్యాఖ్యానించాడు.