: ఢిల్లీ పేలుడు ఘటనపై నివేదిక కోరిన రాజ్‌నాథ్ సింగ్
ఢిల్లీలోని నయాబజార్‌లో ఈ రోజు ఉదయం సంభవించిన పేలుడు కలకలం రేపిన విషయం తెలిసిందే. పేలుడు ధాటికి ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. బహ్రెయిన్‌లో ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ఘటనపై స్పందించి ఢిల్లీ పోలీసు కమిషనర్ అలోక్ వర్మతో ఫోన్లో మాట్లాడారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ ఘటనపై తమకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు.