: ఎన్ కౌంటర్ లో నా బిడ్డ మరణించడం గర్వంగా ఉంది: ఆర్కే సతీమణి, మున్నా తల్లి శిరీష
ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు (ఏఓబీ)లో జరిగిన ఎన్ కౌంటర్ లో మావో నేత ఆర్కే కొడుకు మున్నా అలియాస్ పృథ్వీ మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై ఆర్కే సతీమణి, మున్నా తల్లి పద్మ అలియాస్ శిరీష స్పందిస్తూ, ఈ ఎన్ కౌంటర్ లో మున్నా మరణించడం తనకు గర్వంగా ఉందని అన్నారు. ప్రజల కోసం మృతి చెందిన తన బిడ్డది త్యాగమని అన్నారు. మావోయిస్టులను పోలీసులు దొంగచాటుగా దెబ్బతీయడం చాలా దారుణమని శిరీష అన్నారు.