: అస్వస్థతకు గురైన కరుణానిధి...ఇంట్లోనే వైద్యం
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి అస్వస్థతకు గురయ్యారని పార్టీ ప్రకటించింది. రోజువారీ మందులు పడక ఆయన అలర్జీకి గురయ్యారని డీఎంకే వెల్లడించింది. ఇంట్లోనే ఆయనకు ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరిగిందని, ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని డీఎంకే ఆ ప్రకటనలో తెలిపింది. మరికొంతకాలం ఆయన విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారని డీఎంకే స్పష్టం చేసింది. కాగా, ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం నుంచి కోలుకుంటున్న దశలో కరుణానిధి అస్వస్థతకు గురికావడం పట్ల తమిళనాట ఆందోళన వ్యక్తమవుతోంది.