: తెలంగాణలో అందుబాటులోకి వచ్చిన ఫైర్ బైక్ వాహనాలు


అగ్ని ప్రమాదాలు జరిగిన వెంటనే మంటలను అదుపు చేసేందుకుగాను తెలంగాణ లో ఫైర్ బైక్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి ఈరోజు ఈ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అగ్ని ప్రమాదాలు సంభవించిన వెంటనే మంటలను అదుపు చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే నిమిత్తమే 100 ఫైర్ బైక్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఫైర్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News