: కోలుకున్న జయలలిత... ఆదివారం డిశ్చార్జ్ అయ్యే అవకాశం


తమిళ తంబిల ప్రార్థనలు ఫలించాయి. వారు ఎంతో ఆరాధించే పురచ్చితలైవి, ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మెరుగుపడింది. అంతేకాదు, అన్నీ సవ్యంగా జరిగితే, ఈ ఆదివారం ఆసుపత్రి నుంచి ఆమె డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని చైన్నైలోని అపోలో వైద్యులే స్వయంగా వెల్లడించారు. గత నెల 22న తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ అపోలో ఆసుపత్రిలో జయ అడ్మిట్ అయ్యారు. నెలా మూడు రోజుల నుంచి ఆమె చికిత్స పొందుతూనే ఉన్నారు. అయితే, ఆమె ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆమెను ఎవరికీ చూపించకపోవడం, చికిత్స పొందుతున్న ఫొటోలను విడుదల చేయకపోవడం జనాల్లో అనుమానాలను మరింత పెంచాయి. మరోవైపు, వైద్యులు విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్స్ కూడా ఎప్పుడూ ఒకేలా వస్తుండటం కూడా అనుమానాలను రెట్టింపు చేసింది. తాజాగా, అమ్మ ఆరోగ్యం చాలా బాగుందని, కొన్ని రోజుల్లోనే డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు ప్రకటించడంతో, తమిళనాడులో పండుగ వాతావరణం నెలకొంది. దీపావళిని ఘనంగా నిర్వహించుకునేందుకు తంబిలు రెడీ అవుతున్నారు.

  • Loading...

More Telugu News