: కాకినాడలో ఏపీ హోం మంత్రి చినరాజప్పకు గాయాలు.. ఐసీయూలో చికిత్స


తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని సంజీవని ఆసుపత్రిని సంద‌ర్శించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య‌మంత్రి, హోం మంత్రి చినరాజప్ప ప్ర‌మాదానికి గుర‌య్యారు. మూడో అంత‌స్తునుంచి లిఫ్టులో కిందకు వస్తుండగా లిఫ్టు వైరు ఒక్కసారిగా తెగిపడ‌డంతో చినరాజ‌ప్ప అందులోనే ప‌డిపోయారు. దీంతో ఆయన నడుము భాగంలో గాయాల‌య్యాయి. దీంతో అదే ఆసుపత్రిలోని ఐసీయూలో ఆయ‌న‌కు చికిత్స అందిస్తున్నారు. చిన‌రాజ‌ప్ప‌తో పాటు ఓ కానిస్టేబుల్‌, ఇద్ద‌రు మీడియా ప్ర‌తినిధుల‌కు కూడా గాయాల‌య్యాయి. రొయ్యల శుద్ధి పరిశ్రమలో అస్వస్థతకు గురై ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు చిన‌రాజ‌ప్ప అక్క‌డ‌కు వెళ్లిన‌ట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News