: హోంగార్డుల దీక్ష భగ్నం.. అర్ధరాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు.. పెట్రోలు పోసుకుని హోంగార్డు ఆత్మహత్యాయత్నం
డిమాండ్ల సాధన కోసం హైదరాబాదు అంబర్‌పేటలో హోంగార్డులు చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్షా శిబిరంపై సోమవారం అర్ధరాత్రి దాటాక దాడి చేసిన పోలీసులు అధ్యక్షుడు నారాయణ సహా పలువురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ సందర్భంగా పోలీసులు, హోంగార్డుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పెట్రోలు పోసుకుని హోంగార్డు రమేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రమేష్‌ను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆందోళనకు దిగిన హోంగార్డులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని ఓయూ, అంబర్‌పేట పోలీస్ స్టేషన్లకు తరలించారు. వేతనాలను పెంచడంతోపాటు ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ హోంగార్డులు రెండు రోజులుగా దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.