: డ్రాగన్స్ బతికే ఉన్నాయా?...వైరల్ అవుతున్న వీడియో
'అవతార్' సినిమా చూశారా? అందులో 'పాండోరా' ప్రపంచానికి చెందిన ప్రజలు వాహనంగా వినియోగించిన 'డ్రాగన్లు' నిజంగా బతికే ఉన్నాయా? అంటే అవునని చైనాకు చెందిన 'ఎపెక్స్' ఛానెల్ చెబుతోంది. డ్రాగన్ కంట్రీగా పేరున్న చైనా దేశంలో డ్రాగన్స్ పై ఎన్నో కథలు ఉన్నాయి. రెడ్ డ్రాగన్స్ పేరుతో ఆ దేశంలో ఎన్నో పండగలు కూడా నిర్వహిస్తారు. అలాంటి డ్రాగన్ లను చూసిన వారు ఎవరైనా ఉన్నారా? అంటే సమాధానం చెప్పడం కష్టమే. అయితే ఎపెక్స్ టీవీ ఛానెల్ చిత్రీకరించిన ఓ వీడియోలో రెండు కొండల మధ్య డ్రాగన్ ఆకారంలో ఉన్న పెద్ద జీవి ఎగురుతూ కనిపించింది. దీనిని ఎపెక్స్ ఛానెల్ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. వైరల్ గా మారిన ఈ వీడియోపై ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి. డ్రాగన్స్ ఇలా ఉండవని కొందరంటే... మరి ఎలా ఉంటాయని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. రెండు వర్గాలుగా మారిన వీరిలో ఒక వర్గం ఇది ఫేక్ వీడియో అంటుండగా, కాదు కాదు ఇది డ్రాగనే అంటున్నారు. దీనిని రికార్డు చేసిన టీవీ చానెల్ మాత్రం మార్ఫింగ్ చేయాల్సిన అవసరం మాకేంటని ప్రశ్నిస్తోంది. దీంతో మరికొందరు గ్రహాంతర వాసులేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను మీరు కూడా చూడండి మరి...ఇంతకీ అది డ్రాగనేనంటారా?