: అసహజ శృంగారం ఆరోపణలపై యువకుడి అరెస్టు!
జంతువుతో సంభోగించాడనే ఆరోపణలపై అస్లామ్ ఖాన్ అనే 22 సంవత్సరాల యువకుడిని హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు. ఒక కుక్కతో సంభోగించాడని, దాంతో ఆ కుక్క చనిపోయిందనే ఆరోపణల కారణంగా అతన్ని అరెస్టు చేశామని చెప్పారు. గుబురుగా ఉన్న చెట్ల మధ్య కూర్చుని ఈ ఘాతుకానికి పాల్పడుతున్న అస్లామ్ ఖాన్ ను ఈరోజు ఉదయం స్థానికులు గమనించి తమకు ఫిర్యాదు చేశారని పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఆ కుక్కను గొంతు నులిమి చంపేశాడా? లేక సంభోగిస్తున్న సమయంలో అది చనిపోయిందా? అనే విషయమై దర్యాప్తు చేస్తున్నామని, అతని మానసిక స్థితి బాగానే ఉందని చెప్పారు. రోజువారి పనులు చేసుకునే అతను ఢిల్లీ నుంచి రెండు రోజుల క్రితమే ఇక్కడికి వచ్చినట్లు చెప్పాడని పోలీసులు పేర్కొన్నారు.