: భారత్ మార్కెట్ లోకి రానున్న ‘యాపిల్ వాచ్ నైకీ+’
ఈ నెల 28న భారత్ మార్కెట్లోకి వాటర్ రెసిస్టెంట్ 'యాపిల్ వాచ్ నైకీ+' విడుదల కానుంది. యాపిల్, నైకీ సంస్థలు ఈ విషయాన్ని ఈరోజు ప్రకటించాయి. యాపిల్ వాచ్ 38 ఎంఎం ధర రూ. 32,900, 42 ఎంఎం రూ.34,900 విలువ చేసే ఈ వాచ్ లను నైకీ. కామ్ లోను, నైకీ రిటైల్ స్టోర్స్, ఎంపిక చేసిన యాపిల్ ఆథరైజ్డ్ రీసెల్లర్స్ తో పాటు ఎంపిక చేసిన ప్రత్యేక స్టోర్స్ లోను లభ్యం అవుతాయి. ఈ సందర్భంగా ‘యాపిల్’ చీఫ్ ఆపరేటింగ్ అధికారి జెఫ్ విలియమ్స్ మాట్లాడుతూ, యాపిల్ వాచ్ నైకీ+ కోసం వినియోగదారులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అన్నారు. బిల్డ్- ఇన్ జీపీఎస్ తో ఉన్న ఈ వాచ్ ల ఫీచర్ల విషయానికొస్తే.. వాటర్ రెసిస్టెంట్ (50 మీటర్లు), డిస్టెన్స్, రూట్ వివరాలతో పాటు పలు ఇతర ప్రత్యేకతలు కలిగి, వివిధ రంగుల్లో లభిస్తాయి.