: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఈ రోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 102 పాయింట్లు లాభపడి 28,178 పాయింట్ల వద్ద, నిఫ్టీ 16 పాయింట్లు లాభపడి 8708 పాయింట్ల దగ్గర ముగిశాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లో టాటా మోటార్స్, కోల్ ఇండియా, ఎస్ బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ సంస్థల షేర్లు లాభపడ్డాయి. హెచ్ సీఎల్ టెక్నాలజీస్, జీ ఎంటర్ టెయిన్ మెంట్, ఏషియన్ పెయింట్స్, విప్రో, ఐడియా సెల్యులర్ సంస్థల షేర్లు నష్టపోయాయి. కాగా, డాలరుతో రూపాయి మారకం విలువ రూ.66.85 వద్ద కొనసాగుతోంది.