: రిటైర్డ్‌ ఐఏఎస్‌ శంకర గురుస్వామి మృతి


అనారోగ్యంతో బాధపడుతూ విశ్రాంత ఐఏఎస్‌ అధికారి శంకర గురుస్వామి (84) ఈ రోజు హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా కిమ్స్‌లో ఆయ‌న చికిత్స తీసుకుంటున్నారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయ‌న మ‌ధ్యాహ్నం మృతి చెందార‌ని వైద్యులు తెలిపారు. కేంద్ర‌, రాష్ట్ర సర్వీసుల్లో ఆయ‌న ప‌లు కీల‌క బాధ్య‌త‌లు నిర్వర్తించారు. గ‌తంలో మహబూబ్‌నగర్‌, శ్రీకాకుళం, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. అనంతరం గురుస్వామి కేంద్ర ఆర్థిక సహాయ కార్యదర్శిగా, సర్కారియా కమిషన్‌లో సభ్యుడిగానూ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.

  • Loading...

More Telugu News