: అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్


తమకు, భారత్ కు మధ్య ఉన్న సరిహద్దు వివాదంలో తల దూర్చవద్దని అమెరికాను చైనా హెచ్చరించింది. చైనా సరిహద్దుకు ఆనుకుని ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ ప్రాంతంలో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ పర్యటించిన అనంతరం... చైనా ఈ హెచ్చరికలు జారీ చేసింది. మీ సీనియర్ దౌత్యాధికారి సందర్శించిన ప్రాంతం భారత్, చైనాల మధ్య వివాదాస్పద ప్రాంతంగా ఉందని... అమెరికా చర్యలు ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలను మరింత జటిలం చేస్తాయని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లూ కాంగ్ హెచ్చరించారు. అమెరికా రాయబారి ఈ ప్రాంతంలో పర్యటించడంతో సమస్య మరింత తీవ్రమవుతుందని... భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదంలో అమెరికా తలదూర్చడం ఆపేయాలని కోరారు. మూడో పార్టీ ఎంటర్ అయితే, సరిహద్దు సమస్యలు మరింత సున్నితంగా మారుతాయని అన్నారు. ఈ సమస్యను భారత్, చైనాలు సామరస్యంగా పరిష్కరించుకోగలవనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ వాయవ్య ప్రాంతంలోని తవాంగ్ పట్టణంలో ఇటీవలే స్థానిక సంప్రదాయ పండుగ ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిచర్డ్ వర్మ హాజరయ్యారు. తవాంగ్ జిల్లా తమదే అని చైనా ఎప్పటి నుంచో వాదిస్తోంది. ఈ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్ అని కూడా పిలుచుకుంటోంది.

  • Loading...

More Telugu News