: రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చకుండా, భ‌వ‌నాలు కూల్చుతున్నారు: కిషన్‌రెడ్డి


తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కొత్త సచివాలయం నిర్మాణంపై బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వాస్తు పేరుతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రజల సొమ్మును దుర్వినియోగ‌ప‌రుస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. వాస్తే బాగోలేక‌పోతే తెలంగాణ రాష్ట్రం ఎలా సాధ్య‌మైంద‌ని ఆయ‌న అన్నారు. కొత్త సచివాలయ అవసరం ఇప్పుడు ఉందా? అని ప్ర‌శ్నించారు. న‌గ‌రంలోని రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చకుండా, భ‌వ‌నాలు కూల్చుతున్నార‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. విద్యుత్ సబ్సిడీ, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ పై ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వ‌హిస్తోంద‌ని ఆయ‌న అన్నారు. కేంద్రం నుంచి గ్రామాలకు వ‌చ్చిన 9 వేల కోట్ల రూపాయ‌ల‌ను దారిమళ్లిస్తున్నారని అన్నారు. మరోవైపు ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయ‌లు అప్పులు చేస్తోంద‌ని మండిప‌డ్డారు.

  • Loading...

More Telugu News