: పవన్‌కల్యాణ్ ‘ఒకే ఒక్కడు’.. స్టార్డమ్కు దూరంగా చాలా సింపుల్‌గా ఉంటారు: నటి త్రిష
'వర్షం' సినిమాలో ప్రభాస్ పక్కన అల్లరి అమ్మాయిగా నటిస్తూ తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన చెన్నై భామ త్రిష ఆ తరువాత 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'అతడు', 'పౌర్ణమి', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే', 'కృష్ణ', 'నమో వేంకటేశ' వంటి చిత్రాలతో టాలీవుడ్ లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలలో కూడా కనపడుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో తన అభిప్రాయాలను పంచుకుంది. అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పింది. తన ఫిట్నెస్ రహస్యం నియమబద్ధంగా ఆహారం తీసుకోవడమేనని త్రిష చెప్పింది. ఓ అభిమాని త్రిషను పవన్‌కల్యాణ్ గురించి ఒకమాటలో చెప్పాలంటే? ఏం చెబుతారు అని అడిగాడు. అందుకు త్రిష ట్వీట్ చేస్తూ 'ఒకే ఒక్కడు' అని అభివర్ణించింది. పవన్ కల్యాణ్ ఆయన శైలిలో ఆయన జీవిస్తారని పేర్కొంది. స్టార్డమ్కు పవన్ దూరంగా చాలా సింపుల్‌గా ఉంటారని చెప్పింది. ఇంకా తనకు ఐస్‌క్రీం అంటే చాలా ఇష్టమని, ఇటీవల వచ్చిన సినిమాల్లో తనకు సుల్తాన్ హిందీ చిత్రం నచ్చిందని చెప్పింది. 'మిమ్మల్ని ఏ ప్రశ్న అడిగితే ఇష్టం ఉండదు?' అని తన అభిమాని వేసిన ప్రశ్నకు తనను ఎవరయినా పెళ్లెప్పుడు చేసుకుంటావ్? అని అడిగితే ఆ ప్రశ్న ఇష్టం ఉండదని చెప్పింది. హీరో మహేష్‌బాబుని వృత్తిపై అంకితభావం కలిగిన స్వీట్ సూపర్‌స్టార్ అని త్రిష అభివర్ణించింది. తాను బాధలో ఉన్నప్పుడు అందరికీ దూరంగా వెళ్లిపోతానని చెప్పింది. సినీ పరిశ్రమకు నిజమైన ‘డార్లింగ్’ ప్రభాస్ అని ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొంది. తాను వివాదాస్పద అంశాలను చిరునవ్వుతో ఎదుర్కుంటానని చెప్పింది. తనకు బీఎండబ్ల్యూ కారంటే ఇష్టమని పేర్కొంది. తన అభిమాన నటి, నటుడు ప్రియాంక చోప్రా, సల్మాన్‌ఖాన్ అని చెప్పింది.