: ముఖేష్ అంబానీ గారూ! రిలయన్స్ 'పియో' ప్రారంభించండి: నెటిజన్ల వేడుకోలు


టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. కాల్ రేట్లు, డేటా టారిఫ్ లు ఒక్కసారిగా కిందికి దిగాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని వేడుకుంటూ నెటిజన్ ఓ పేరడీ పోస్టు పెట్టి విజ్ఞప్తి చేశాడు. టెలికాం రంగంతోనే ముఖేష్ అంబానీ ఆగిపోకూడదని, మద్యం వ్యాపారం లోకి కూడా రావాలని కోరాడు. 'రిలయన్స్ జియో' తరహాలో 'రిలయన్స్ పియో' పథకం ప్రవేశపెట్టాలని కోరాడు. ఈ పథకం ద్వారా మద్యాన్ని ఉచితంగా అందించి, స్నాక్స్ కు మాత్రమే ధర వసూలు చేయాలని సూచించాడు. ఈ ఆఫర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నామని అన్నాడు. ఈ పోస్టు సోషల్ మీడియాలో షేర్లు, లైకులు, కామెంట్లతో దూసుకుపోతోంది.

  • Loading...

More Telugu News