: ఏపీ అసెంబ్లీ సెక్రటరీపై హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్యే పిటిషన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇంఛార్జ్ సెక్రటరీ సత్యనారాయణపై హైకోర్టులో ఈ రోజు పిటిషన్ దాఖలైంది. ఆ పదవికి ఆయన అనర్హుడంటూ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సత్యనారాయణకు లా డిగ్రీ లేదంటూ పిటిషన్ లో ఆళ్ల ఆరోపించారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు సత్యనారాయణకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు, నాలుగు వారాల్లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.