: ఎస్పీలో పెద్ద ఉపద్రవం సంభవిస్తుందని అమర్ సింగ్ ముందే సూచించారు: అఖిలేష్ యాదవ్
ఉత్తరప్రదేశ్ లో అధికార సమాజ్ వాదీ పార్టీలో సంభవించిన ఉపద్రవం గురించి ఆ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ అమర్ సింగ్ ముందుగానే సూచించారని సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. ఒక ఆంగ్లపత్రిక కథనం ప్రకారం, సమాజ్ వాదీ పార్టీలో అంతర్గత పోరు జరుగుతుందనే విషయం అమర్ సింగ్ కు తెలుసని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నట్లు రాసింది. ‘పార్టీలో అక్టోబర్ లో పెద్ద ఉపద్రవం సంభవించనుందని అమర్ సింగ్ చెప్పారు’ అని అఖిలేష్ పేర్కొన్నారని ఆ కథనంలో రాశారు. కాగా, ఎస్పీ నేతలు శివపాల్ యాదవ్, రాంగోపాల్ యాదవ్ లతో పాటు అమర్ సింగ్ వర్గానికి చెందిన మంత్రులను వారి పదవుల నుంచి తప్పించిన మర్నాడే అఖిలేష్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.