: ట్రిపుల్ తలాక్ అంశాన్ని మోదీ రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారు: అసదుద్దీన్ ఒవైసీ


ప్రధాని నరేంద్ర మోదీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ట్రిపుల్ తలాక్ అంశాన్ని తన రాజకీయ అవసరాలకు మోదీ వాడుకుంటున్నారని ఆరోపించారు. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో, ఈ అంశాన్ని రాజకీయ అస్త్రంగా వాడుకుని, ఎన్నికల్లో లబ్ధి పొందాలని మోదీ భావిస్తున్నారని విమర్శించారు. మన దేశంలో 7.3 కోట్ల మంది పెళ్లయిన ముస్లింలు ఉన్నారని... వారంతా విడాకులు తీసుకోవడం లేదని ఒవైసీ అన్నారు. కేవలం ఒక శాతం మంది ముస్లింలు మాత్రమే ట్రిపుల్ తలాక్ చెబుతున్నారని తెలిపారు. రాజకీయంగా లబ్ధి పొందడానికే 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ఈ అంశాన్ని మోదీ ప్రస్తావించారని ఒవైసీ మండిపడ్డారు.

  • Loading...

More Telugu News