: 18 ఎకరాల భూమిని లోకేష్ దోచుకోవడానికి రంగం సిద్ధమైంది: వైసీపీ


విశాఖపట్నంలోని దసపల్లా హిల్స్ లో రూ. 1500 కోట్ల కుంభకోణం జరుగుతోందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ ఆరోపించారు. 18 ఎకరాలు ప్రభుత్వ భూమిని ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేశ్, ఆయన బినామీలు దోచుకోవడానికి రంగం సిద్ధమైందని ఆయన తెలిపారు. ఈ రోజు హైదరాబాదులోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ భూమి ప్రభుత్వానికి చెందినదంటూ అప్పటి జిల్లా కలెక్టర్ యువరాజ్ గెజిట్ లో నోటిఫై చేశారని... దాంతో, ఆయనను బదిలీ చేశారని ఆరోపించారు. నిజాయతీగా పనిచేస్తున్న కలెక్టర్లకు బదిలీలు, సస్పెన్షన్లు ఇస్తున్నారని... కొమ్ము కాసేవారికి ప్రమోషన్లు ఇస్తున్నారని విమర్శించారు. ఆ భూమిని కాపాడేంతవరకు తమ పోరాటం ఆగదని అమర్ నాథ్ తెలిపారు. అవసరమైతే ఈ విషయంపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News