: హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై అత్యాచారయత్నం
ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా హైదరాబాదులో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై ఈ రోజు వేకువజామున అత్యాచార యత్నం జరిగింది. వివరాల్లోకి వెళ్తే, తన విధులు ముగించుకుని క్యాబ్ లో ఇంటికి వెళుతున్న ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ తో పాటు, క్యాబ్ లోనే ఉన్న క్యాబ్ సూపర్ వైజర్ లు లైంగిక దాడికి యత్నించారు. ఊహించని పరిణామానికి తొలుత షాక్ కు గురైన ఆమె... చివరకు ధైర్యంగా వారిని ప్రతిఘటించింది. దీంతో, నిందితులు ఇద్దరూ అక్కడ నుంచి పరారయ్యారు. జరిగిన ఘటనపై ఆల్వాల్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి, ఆల్వాల్ పీఎస్ కు తరలించారు. వీరిద్దరినీ కమిషనర్ కార్యాలయానికి తరలించి, అక్కడ విచారణ జరపనున్నట్టు తెలుస్తోంది.