: హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి చంద్రకుమార్ సంచలన వ్యాఖ్యలు.. రూ.200 లంచానికి రాజీవ్‌ను కోల్పోయామని వ్యాఖ్య
హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి చంద్రకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం 200 రూపాయల లంచం కోసం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.200 లంచానికి ఆశపడ్డ ఓ హెడ్ కానిస్టేబుల్ నిర్వాకం వల్లనే ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడికి పాల్పడగలిగిందని ఆయన పేర్కొన్నారు. సమాజంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన అవినీతిని కూకటివేళ్లతో పెకలిస్తే తప్ప ఫలితం ఉండదన్నారు. జాతీయ అవినీతి నిర్మూలన కౌన్సిల్ ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న చంద్రకుమార్ పై విధంగా వ్యాఖ్యానించారు.