: కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు మేము బెదరం: మధు యాష్కి
కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు తాము బెదరమని, టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాబందుల సమితి అంటూ కాంగ్రెస్ పార్టీ నేత మధు యాష్కి తీవ్రంగా విమర్శించారు. నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నేతల పాదయాత్ర ముగిసిింది. ఈ పాదయాత్రలో ఉత్తమ్ కుమార్, జానారెడ్డి, జీవన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మధుయాష్కి పాల్గొన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మధు యాష్కి మాట్లాడుతూ, వందరోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారని, ఎంపీ కవితకు నిజామాబాద్ కు వచ్చే దమ్ము లేదని ఆయన విమర్శించారు.