: టీమిండియా లక్ష్యం 286 పరుగులు!
మొహాలీలో జరుగుతున్న మూడో వన్డే లో 49.4 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ 285 పరుగులు చేసింది. గుప్తిల్ (27), లాథమ్ (61), విలియమ్ సన్ (22), టేలర్ (44), ఆండర్సన్ (6), రోంచి (1), నీషమ్ (57), సాంత్నర్ (7), సౌథీ (13), బౌల్ట్ (1) పరుగులు చేయగా, హెన్రీ 39 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. టీమిండియా బౌలర్లు యాదవ్ -3, బుమ్రా - 2, జాదవ్ -3, మిశ్రా -2 చొప్పున వికెట్లు తీసుకున్నారు. కాగా, 286 పరుగుల విజయ లక్ష్యంతో టీమిండియా మరికొద్ది సేపట్లో బరిలోకి దిగనుంది.