: ఆందోళనకరంగా మమతా బెనర్జీ మేనల్లుడి ఆరోగ్యం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ అభిషేక్ బచ్చన్ కోల్ కతాలోని బెల్లె వ్యూ క్లినిక్ లో చికిత్స పొందుతున్నారు. అభిషేక్ జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారని, గత రెండు రోజులుగా ఆయన హృదయ స్పందన నిలకడగా లేదని, ఆయనకు కృత్రిమ శ్వాస కొనసాగిస్తున్నామని ఈరోజు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు. కాగా, గత మంగళవారం పార్టీ మీటింగ్ కు హాజరై తిరిగి వస్తున్న సమయంలో రత్నపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అభిషేక్ బెనర్జీ గాయపడ్డారు.