: హైటెన్షన్ పుట్టిస్తున్న స్వామి స్వరూపానంద హైదరాబాద్ టూర్!


షిర్డీ సాయి దేవుడు కాదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద స్వామిజీ హైదరాబాద్ టూర్ హైటెన్షన్ పుట్టిస్తోంది. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో ‘గురు వందనమ్’ కార్యక్రమంలో స్వరూపానంద పాల్గొంటున్నారు. కాగా, షిర్డీ సాయిపై స్వరూపానంద స్వామిజీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని సాయి భక్తులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు లలిత కళా తోరణం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News